calender_icon.png 27 February, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య

27-02-2025 12:44:51 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి) : ఫైనాన్సులో టాటా ఏసి ట్రాలీ తీసుకొని కట్టలేని పరిస్థితిలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొల్లాపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. 

వివరాలు.. మహబూబాబాద్ జిల్లా కొల్లాపురం గ్రామానికి చెందిన పిట్టల వీరన్న తండ్రి రాములు 40 సంవత్సరాలు చేపలు పట్టుకొని జీవనం కొనసాగిస్తుండగా ఈ క్రమంలో టాటా ఏసీ ట్రాలీని ఐదు లక్షల 50 వేలకు ఫైనాన్స్లో కొనుగోలు చేసి దానికి కిస్తీలు కట్టడం ఇబ్బంది కావడంతో ఇంట్లో భార్యాభర్తలు సంపాదించిన సంపాదనంతా కిస్తీలకే సరిపోతుందని గొడవ పడి తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.