calender_icon.png 20 September, 2024 | 12:51 PM

రైతుపక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం

27-07-2024 12:05:00 AM

రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ, జూలై 27 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, అందుకే వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో రూ.72,659 కోట్లు నిధులు కేటాయించిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమా టోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని మంత్రి క్యాంపు కార్యాయలంలో శుక్రవారం నకిరేకల్ ఎమ్మె ల్యే వేముల వీరేశంతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్‌లో రుణమాఫీ పథకానికి రూ.31 వేల కోట్లు కేటాయించామన్నారు. మున్ముందు ప్రతి నియోజకవర్గంలో రూ.80 కోట్లతో 20 ఎకరాల్లో సమీకృత వసతి గృహాలు నిర్మిస్తామన్నారు.

త్వరలో స్కిల్ డెవెలప్‌మెంట్ యూనివర్సిటీకి టెండర్లు పిలుస్తామన్నారు. ఎస్‌ఎల్బీసీ సొరంగం పనులను త్వరితగతిన పూర్తి  చేస్తామన్నారు. పదిరోజుల్లో బ్రాహ్మ ణ వెల్లెంల ప్రాజెక్ట్ పరిధిలో ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు.  అనంతరం మంత్రి కలెక్టర్ సినారాయణరెడ్డితో కలిసి జిల్లా కేం ద్రంలో నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ వైద్యశాల పనులను పరిశీలించారు. ఆగస్టు నెలా ఖరులోపు పనులు పూర్తి చేసి సీఎం చేతులమీదుగా వైద్యశాలను ప్రారంభిస్తామన్నారు.