calender_icon.png 18 April, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు అవగాహన సదస్సు

11-04-2025 12:46:51 PM

మిరప పంట సాగులో రసం పీల్చుకునే పురుగుల ఉదృతిని తగ్గించుకోవడానికి నీలి, పసుపు రంగు అట్టలను వాడాలి 

కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా.ఎస్ నవీన్ కుమార్ 

చర్ల,(విజయక్రాంతి ): మిరప పంటపై రసం పీల్చే పురుగులను నివారించేందుకు తోటలో నీలి, పసుపు రంగు అ ట్టాలను అమర్చాలని కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త నవీన్ కుమార్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) చర్ల మండల పరిధిలోగల సుబ్బంపేట గ్రామం లో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో  ఆయన పాల్గొన్నారు. వివిధ పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. వరిలో పురుగులను తెగుళ్లను తట్టుకుని స్వల్ప కాలిక రకాలను సాగు చేసి పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవాలని తద్వారా సాగు నీటిని పొదుపుగా వాడుకొని అధిక దిగుబడి పొందాలని సూచించారు.

యాసంగి సాగు(Yasangi Sagu)లో స్వల్ప కాలిక రకాలను సాగు చెయ్యడం ద్వారా నీటి ఎద్దడిని అధిగమించి పంట ఏప్రిల్ నెలలో వడగండ్ల వానల బారిన పడకుండా కాపాడవచ్చు అని వివరించారు.మిరప పంట సాగులో రసం పీల్చుకునే పురుగుల ఉదృతిని తగ్గించుకోవడానికి నీలి, పసుపు రంగు అట్టలను విరివిగా మిరప తోటలో ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది. రైతులకు పసుపు నీలి రంగు అట్టలను రైతులకు పంపిణీ చెయ్యడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ ఏపీఓ  ఉదయ్ కుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారి లావణ్య, విస్తరణ అధికారులు ఎండి. అఫ్రిద్, ఏ .రామకృష్ణ లు పంచాయతీ కార్యదర్శి జె సర్వేశ్వర్ రావు మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.