సర్వే పనులను తనిఖీ చేసిన జిల్లా అడిషనల్ కలెక్టర్..
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో రైతు భరోసా సమగ్ర భూ సర్వే పనులు గురువారం తాహసిల్దార్ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. సర్వేలో భాగంగా గుట్ట మల్లారం, కట్టు మల్లారం గ్రామపంచాయతీల పరిధిలో రెవిన్యూ సిబ్బంది చేపట్టారు. కాగా, సమగ్ర సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. సర్వే పనుల్లో ఎటువంటి అవకతవకలకు తావివ్వకుండా ఖచ్చితమైన ప్రమాణాలను పాటిస్తూ సరితగాతిన పనులు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ పల్నాటి వెంకటేశ్వర్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.