22-12-2024 01:19:46 AM
* సాగు చేసే భూములకే సర్కారు సాయం
* బోనస్‌తో 61శాతానికి పెరిగిన సన్నాల సాగు
* పంట బీమాను పునరుద్ధరిస్తాం
* అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): సంక్రాంతి నాటికి రైతు భరోసా విధివిధానలు ఖరారు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశా రు. శనివారం అసెంబ్లీలో రైతు భరోసాపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నాయకులు అడిగి న ప్రశ్నలకు మంత్రి వివరణ ఇచ్చారు. రైతు భరోసా అమలుకు సూచనలు చేయాలని కోరితే బీఆర్‌ఎస్ సహకరించలేదని.. బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యుల సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.
పంట వేసే భూములకే రైతు భరోసాను అందిస్తామని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి డ్రిప్, స్ప్రింక్లర్స్, డ్రోన్ వంటి పథకాలకు గత సర్కారు తిలోదకాలిచ్చిందని.. వాటిని తాము పునరు ద్ధరిస్తామ న్నా రు. రైతు పథకాల అమలు కోసం కేంద్రం సహకారం తీసుకుంటామన్నారు. అదేవిధంగా పంట బీమా పథకాన్ని పునరుద్ధరిస్తా మని మంత్రి పేర్కొన్నారు. కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తామని చెప్పారు. రైతు బీమాను యథావిధిగా కొనసాగిస్తామన్నా రు. గతంలో లేని విధంగా బడ్టెట్‌లో 35శాతం వ్యవసాయ రంగానికే ప్రభుత్వం కేటాయించినట్టు తుమ్మల గుర్తు చేశారు.
61శాతానికి చేరిన సన్నాల సాగు..
పేదలతో పాటు విద్యార్థులకు సన్న బియ్యం అందించాలన్న ఉద్దేశంతోనే ప్రభు త్వం సన్న వడ్లకు బోనస్‌ను ప్రకటించిందని మంత్రి చెప్పారు. బోనస్ వల్ల సన్నాల సాగు 21 నుంచి 61శాతానికి పెరిగినట్టు స్పష్టం చేశారు. వాస్తవానికి సన్నాల సాగుతో దిగుబడి తగ్గుతుందని, అందుకోసమే రైతుల ప్రోత్సాహకానికి తాము బోనస్ ఇస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో పండిన పంటలను ఎంఎస్పీ ధరకే కొనుగోలు చేస్తామని.. కేంద్రం కూడా రాష్ట్రంలో పండిన అన్ని ధాన్యాలను ఎంఎస్పీకే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు మంత్రి చెప్పారు. వ్యవసాయంలో యాంత్రీకణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు వేదికలు నిర్వీర్యంగా మారాయని, తాము వాటిని రైతులకు ఉపయోగ పడేలా చేస్తున్నామన్నారు.