calender_icon.png 10 January, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు భరోసా ఖాయం

30-12-2024 02:43:57 AM

ప్రజా ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుంది

  1. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచేలా అధికారులు కృషిచేయాలి
  2. రైతు భరోసా పంపిణీపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ
  3. మరోసారి సమావేశమై రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

* బ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినప్పుడు రైతులు వ్యక్తంచేసిన అభిప్రాయాలు, అధికారులు సేకరించిన సమాచారంపై  మంత్రులు ఈ సమావేశంలో చర్చించారు.

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయ క్రాంతి): ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉందని, ఆర్థ్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నా ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం సచివాలయంలో రైతు భరోసా సబ్ కమిటీ సమావేశ మైంది.

ఇందులో సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మ ల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై సబ్ కమిటీ సభ్యులు రెండు గంటల పాటు కసరత్తు చేశారు.

పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటివరకు రైతు భరోసా అందించిన తీరు, సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన ప్పుడు రైతులు వ్యక్తంచేసిన అభిప్రా యాలు, అధికారులు సేకరించిన సమా చారంపై చర్చించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు భరోసా ఇచ్చి తీరుతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

రాష్ట్ర బడ్జెట్‌లో  వ్యవసాయ, అనుబంధ రంగాలకు  రూ. 72,659 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైతు ల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధ్ది ఈ అంకెలు తెలియజేస్తాయన్నారు. రెండు లక్షల రుణమాఫీ కింద రెండు నెలల వ్యవధిలో రూ. 21వేల కోట్ల నగదు రైతుల బ్యాం క్ ఖాతాల్లో జమచేసినట్లు వెల్లడించారు. 

లాభసాటిగా వ్యవసాయం

రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు రైతులు సంక్షేమానికి కృషి చేసేందుకు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో నిర్మించిన రైతు వేదికలను పూర్తిస్థాయిలో విని యోగంలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతు వేదికలను ఆధునిక రీంచేందుకు ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమం చేపట్టిందని, 110 రైతు వేదికల్లో రూ. 5 కోట్లకు పైగా నిధులు వెచ్చించి వీడియా కాన్పిరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా ప్రజా ప్రభుత్వం తొలి ఏడాదిలోనే యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేసిన విషయం గుర్తు చేశారు. 1.57లక్షల ఎకరాలకు రూ. 7625 కోట్ల నిధులు రైతులు ఖాతాలో జమచేశామన్నారు. ఏడాది పాటు శ్రమించినా అనుకోని ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతికి వస్తుందో రాదోఅని భయాలు నిత్యం రైతులు వెంటాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.  పంటల బీమా పథకం కింద ప్రీమియం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన చెల్లిస్తుందన్నారు. పంటకే కాదు రైతు కుటుంబానికి భరోసాగా నిలిచేందుకు రైతు బీమా పథకానికి కూడా ప్రభుత్వం ప్రీమి యం చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. 2024 25లో రాష్ట్రంలో ఒక లక్ష ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

2023 ఏడాదిలో ఆయిల్ ఫామ్ సాగు పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ. 80.10 కోట్లు విడుదల చేయగా, రాష్ట్ర వాటాతో రూ. 133.05 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.  అదే విధంగా రైతుల నుంచి కొనుగోలు చేసే సన్నధాన్యానికి ప్రతి క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌గా చెల్లిస్తుందన్నారు.

గత వానకాలంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జిల్లాలో ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేందుకు జిల్లా వారీగా సీనియర్ అధికారులను నియమించి చర్యలు చేపట్టామన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి రఘు, డైరెక్టర్ గోపీ, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.