- రైతు వేదికల్లో సంబురాలు
- సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
మెదక్/వెల్దుర్తి/నర్సాపూర్/కౌడిపల్లి, జూలై 18: రుణమాఫీపై అన్నదాతల్లో ఆనం దం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా గురువారం రుణమాఫీ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. రైతు వేదికల్లో సంబురాలు నిర్వ హించారు. పలుచోట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. సీఎం సందేశాన్ని రైతులంతా వీడి యో కాన్ఫరెన్స్‌లో వీక్షించారు. పలుచోట్ల స్వీట్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమా ల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొన్నారు.
సంగారెడ్డి: ఆందోల్ మండలంలోని డాకూర్ రైతు వేదికలో నిర్వహించిన రుణమాఫీ సంబురాల్లో రాష్ట్ర, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా పాల్గొన్నా రు. కలెక్టర్ క్రాంతి వల్లూరు పాల్గొన్నారు.
జహీరాబాద్: జహీరాబాద్ మండలంలోని హుగ్గేలి రైతు వేదికలో నిర్వహించిన సంబురాల్లో ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్ పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డా.చంద్రశేఖర్ పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి: ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన సంబురాల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతు కే జండగే పాల్గొన్నారు.
నారాయణఖేడ్: నారాయణఖేడ్ ఎమ్మె ల్యే పీ సంజీవరెడ్డి నియోజకవర్గంలోని వివి ధ మండలాల్లో రుణమాఫీ సంబురాల్లో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
రంగారెడ్డి: ఆమనగల్లు మండల కేంద్రం లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, షాద్‌నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంబురాల్లో పాల్గొని సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ఎమ్మె ల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
సంబురాల్లో గందరగోళం
పటాన్‌చెరు: జిన్నారం మండలం సోలక్‌పల్లిలో నిర్వహించిన రుణమాఫీ సంబురాలు గందరగోళంగా మారాయి. సోలక్‌పల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన సంబురాలకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, మెదక్, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థులు నీలం మధు, గాలి అనిల్ కుమార్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ వీక్షించేం దుకు రైతు వేదికలో వేసిన కుర్చీలపై ముఖ్య నాయకులతో పాటు జిన్నారం మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ కూర్చోవడం, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ నిలబడడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీరియస్ అయ్యారు.
సంవత్సరాలుగా పార్టీలో ఉన్న నాయకునికి కుర్చీ లేదు గానీ ఇటీవల పార్టీలో చేరిన ప్రభాకర్‌కు కుర్చీ ఎలా వేస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ కొత్త, పాత గ్రూప్‌ల మధ్య విభేదాలు బయటడ్డాయి. సంవత్సరాలుగా పార్టీలో ఉన్న నాయకునికి కుర్చీ లేదు గానీ ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి కుర్చీ వేయడం ఏంటని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సమక్షంలో జై కాట శ్రీనివాస్‌గౌడ్.. జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.
జిల్లాల వారీగా లబ్ధిదారులు..
- రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో 49,741 మంది రైతులకు రుణమాఫీ జరిగింది.
- యాదాద్రి భువనగిరి జిల్లాలో 36,420 మందికి ప్రభుత్వం రూ.199.87 కోట్లు విడుదల చేసింది.
- వికారాబాద్ జిల్లాలో 46,633 మంది రైతులకు తొలి విడతలో రుణమాఫీ వర్తించింది.
- సంగారెడ్డి జిల్లాలో 51,162 మందికి రూ. లక్షలోపు రుణమాఫీ జరిగింది.