calender_icon.png 11 January, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిక్కుతో వీడ్కోలు

02-01-2025 02:42:08 AM

  • ఒక్క రోజే రూ. 7 కోట్ల మద్యం అమ్మకాలు

94 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు

కరీంనగర్, జనవరి 1 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో డిసెంబర్ 31, 2024 సంవత్సరం వీడ్కోలును కిక్కుతో ముగిం చారు. రాష్ర్టంలోనే హైదరాబాద్, రంగారెడ్డి తర్వాత కరీంనగర్ జిల్లాలో 7 కోట్ల రూపా యల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెం బర్ 1 నుంచి 31 వరకు 126 కోట్ల రూపా యలు అమ్మకాలు జరిగాయి. జిల్లాలో 94 మద్యం షాపులు, 32 బార్ అండ్ రెస్టారెం ట్లు ఉన్నాయి.

బెల్టు షాపులు వందల సంఖ్య లో ఉన్నాయి. డిసెంబర్ 31 రోజున రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచారు. ఒక పక్క పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నప్పటికి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకునేందుకు మందుబాబులు మద్యం షాపుల ఎదుట క్యూకట్టారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఉన్న కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి, హుజూరాబాద్‌ని యోజకవర్గా ల పరిధిలో పోలీసులు విస్తృతంగా రాత్రి 9 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు డ్రంకెన్ డైవ్ టెస్టులు, తనిఖీలు, పె ట్రోలింగ్ నిర్వహించారు.

మొత్తం 94 మంది పై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. కరీంనగర్సపీ అభిషేక్ మొహంతి ఆధ్వర్యం లో పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా ప్రశాంతంగా ముగిశాయి. పోలీసుల భయానికి చాలామంది వేడుకలను కాలనీ ల్లో తమ తమ ఇండ్లవద్ద, అపార్ట్మెంట్ల వద్ద, దగ్గరలో ఉన్న పంక్షనాళ్లలో నిర్వహించుకు న్నారు. ఎక్కువ సంఖ్యలో యువత రోడ్లపైకి వచ్చి వేడుకలు జరుపుకున్నారు.