calender_icon.png 19 September, 2024 | 10:04 PM

వీడ్కోలిక వినాయకా!

19-09-2024 12:20:55 AM

  1.  భాగ్యనగరంలో రెండో రోజూ విగ్రహాల నిమజ్జనం
  2. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ఉత్సవాలు పూర్తి

* మహాగణేశుడి విగ్రహాల నిమజ్జనోత్సవాల్లో భాగ్యనగరం మునిగి తేలింది. మంగళవారం ఉదయం మొదలైన శోభాయాత్రలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి.  జీహెచ్ ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారుల పర్యవేక్షణలో రెండో రోజు బుధ వారం నిమజ్జన కార్యక్రమాలు కొనసాగాయి. సిబ్బంది భారీ క్రేన్లతో సాయంతో సుమారు 1.40 లక్షల విగ్రహాలను నిమజ్జనం చేశారు. 

హైదరాబాద్ సిటీబ్యూరో/ సంగారెడ్డి, సెప్టెంబర్ 18(విజయక్రాంతి):  నిమజ్జన ఉత్సవాలను వీక్షించేందుకు హుస్సేన్‌సాగర్ వద్ద ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌మార్గ్, పీవీ మార్గ్‌కు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ట్యాంక్‌బండ్, పీవీమా ర్గ్‌లో 300 వరకు విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఒక్క హుస్సేన్‌సాగర్‌లోనే 6,739 మట్టి విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. రెండో రోజు ప్రధానమార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను ఎత్తివేసినప్పటికీ హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో మాత్రం రద్దీ కనిపించింది.

సం గారెడ్డి జిల్లాలోనూ వినాయక నిమజ్జనం ప్రశాం తంగా ముగి సింది. ఉత్సవ కమిటీ నిర్వాహకులు సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు, జహీరాబాద్ పట్టణంలో నారింజ ప్రాజెక్టులో విగ్రహాలను నిమజ్జనం చేశారు. పటాన్‌చెరు, సదాశివపేట, జోగిపేట, నారాయణఖేడ్‌లో ప్రతిష్ఠిం చిన విగ్రహాలను పట్టణాల సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. నిమజ్జన వేడుకలను మల్టీ జోన్ ఐజీ సత్యనా రాయణ, ఎస్పీ చెన్నూర్ రూపేష్  పరిశీలించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా  వేలాది మంది పోలీసులు బందో బస్తు నిర్వహించారు.

పారిశుధ్య నిర్వహణకు 200 బృందాలు.. 

నిమజ్జనోత్సవాలు పూర్తయినందున చెరువులు, కుంటలు, పాండ్స్‌లో  వ్యర్థాల తొలగింపునకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా 200 బృందాలను నియమించింది. ప్రతి 100 మీటర్లకు ఒక శానిటేషన్ బృం దం పారిశుధ్య చర్యలు చేపట్టనున్నది. శోభాయాత్ర జరిగిన అన్ని రూట్లలో గురువారం నుంచి పారిశుధ్య చర్యలు ప్రారంభమవుతాయి. నిమజ్జనోత్సవాలు పూర్తయి నందున హెచ్‌ఎండీఏ అధికారులు హుస్సేన్‌సాగర్‌లో వ్యర్థాల తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు. బుధవారం ఒక్కరోజే 7 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు. తొలగింపు ప్రక్రియ మరో వారం రోజుల పాటు కొనసాగనున్నది. అలాగే మహానగర వ్యాప్తంగా రోజుకు 8 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సిబ్బంది తరలించనున్నారు.

పారిశుధ్య సిబ్బంది రోడ్లపై పేరుకున్న చెత్త, కలర్ పేపర్లు, ఇతర వ్యర్థాలను సేకరించి ప్రత్యేక వాహనాల్లో తరలించను న్నారు. బుధవా రం ఒక్కరోజే సిబ్బంది సుమారు 10 వేల మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాలను తొలగించి ఉండొచ్చని అంచ నా. నిమజ్జన కార్యక్రమం లో నిమగ్నమైన క్రేన్ ఆపరేటర్లు, సహాయ కులు, ఇతర వర్కర్లు, మండపాల నిర్వాహకులు, భక్తులు, ప్రజలకు జీహెచ్‌ఎంసీ ఉచితంగా అల్పాహారం, ఉచిత భోజన వసతి కల్పించింది. ఉదయం 2 వేల మందికి అల్పాహారం, మధ్యాహ్నం 4 వేల మందికి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేసింది.

నిమజ్జనోత్సవం.. ప్రశాంతం: సీపీ

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): గతేడా దితో పోల్చితే ఈసారి మూడు గంటల ముందే నిమజ్జనోత్సాలు పూర్తయ్యాయని, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు ముగిశా యని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం ఆయన నగరంలో జరిగిన నిమజ్జనోత్సవాలను పరిశీలించి మాట్లాడారు. వేడుకల కు సహకరించిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితితో పాటు ఇతర ఉత్సవ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా నెక్లెస్ రోడ్డు, ఐమాక్స్ మైదానంలోనే విగ్రహాలను నిలిపివేశామన్నారు. ట్రాఫిక్ దృష్ట్యా బుధవారం ఉదయం 10:30 గంటలకే అన్ని జంక్షన్లు, ఫ్లు ఓవర్లను తెరిచామన్నారు. బందోబస్తులో 25 వేల మంది పోలీసులు షిఫ్టుల వారీగా భాగస్వామలయ్యారు. విధులను వందశాతం నిబద్ధతతో నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.

నాలుగు రోజులు.. 20 లక్షల మంది ప్రయాణం

గణేశ్ నిమజ్జనోత్సవాల సందర్భంగా వరుసగా నాలుగు రోజుల్లో  సుమారు 20 లక్షల మంది ప్రయాణికులు మెట్రోరైళ్లలో ప్రయాణించారు. ఒక్క  మంగళవారం రోజే 4.80 లక్షల మందికి పైగా ప్రయాణించడం విశేషం. బుధవారం పనిదినం కావడంతో ఈ రోజుకు కూడా మెట్రో రైళ్లు, స్టేషన్లలో రద్దీ కనిపించింది. ఖైరతాబాద్‌లోని సప్తముఖ మహాగణపతి విగ్రహాన్ని దర్శించుకునేందుకు ఎక్కువ మంది భక్తులు ఈ మెట్రోస్టేషన్ నుంచి రాకపోకలు సాగించారు. పూర్తి వివరాలను హెచ్ ఎంఆర్‌ఎల్, ఎల్‌అండ్‌టీఎం ఆర్‌హెచ్‌ఎల్ అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.