calender_icon.png 3 April, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టు రేణుకకు వీడ్కోలు

03-04-2025 12:00:00 AM

జనగామ, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ గుముడవెల్లి రేణుక అంత్యక్రియలు ఆమె స్వగ్రామం జనగామ జిల్లా కడవెల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. వేలాదిమంది విప్లవ నినాదాల మధ్య ఆమె అంతిమయాత్ర కొనసాగింది. అరుణ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం కడవండి వద్ద ఉంచారు.

ఆమెకు సుమారుగా 3,000 మంది నివాళులు అర్పించారు. ఎర్రజెండాలు చేత బోని వేలాది మంది అక్కడికి తరలి రావడంతో కడవెండి గ్రామం ఎరుపెక్కింది. ఓవైపు కళాకారుల ఆటపాట, మరోవైపు డప్పు చప్పుల్లు, విప్లవ గీతాలతో నాలుగు దిక్కులు పెక్కటిల్లాయి.

ప్రజా సంఘాల నాయకులు, సామాన్య ప్రజలు, విప్లవ సానుభూతిపరులు, వివిధ పార్టీల నేతలు, యువకులు, ప్రొఫెసర్లు అంతిమ యాత్రలో పాల్గొని రేణుకక్క అమరహే అంటూ నినాదాలు చేశారు. నీవెక్కడికి వెళ్లలేదని వికసించే ఎర్రమందారంలోనూ, కదిలే మేఘాలలోనూ నీ రూపాన్ని చూసుకుంటామంటూ నినదించారు. విప్లవం ఉన్నంతకాలం నీవు బతికే ఉంటావంటూ అమ్మ గిల్లి నా కళ్ళతో తమ భావాన్ని వ్యక్తం చేశారు. 

ఆట పాటలతో అంతిమ యాత్ర

రేణుకక్క అంతిమయాత్ర ఆద్యంతం వేలాదిమంది నినాదాల మధ్య కొనసాగింది. అంతిమయాత్రలో కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. బూటకపు ఎన్కౌంటర్ తో రేణుకక్కను పొట్టన పెట్టుకున్నారని పలువురు విమర్శించారు. రేణుక అక్కకు కళాకారులు తమ ఆటపాటలతో అంత్యక్రియలు నిర్వహించారు.

విప్లవ పాటలు, డప్పు చప్పుళ్ళు, మహిళల కోలాటం మధ్య అంతిమయాత్ర కొనసాగింది. ఎమ్మెల్యే వేముల వీరేశం భార్య వేముల పుష్ప డప్పు కొడుతూ పాటలు పాడుతూ అంతిమయాత్రలో అందరినీ ఉత్సాహపరచారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అర్పించారు.

నివాళి అర్పించిన వారిలో సాంస్కృతిక కళాశాలది చైర్పర్సన్ వెన్నెల, అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు బి.అంజమ్మ, నాయకురాలు పద్మ కుమారి, ఉమ్మడి వరంగల్ అధ్యక్షురాలు శాంతక్క, విప్లవ రచయితల సంఘం కార్యదర్శి రివేరా, సీనియర్ కార్యవర్గ సభ్యుడు పాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాత్రి సుధాకర్, రాము, సుదర్శన్, బాలసాని రాజయ్య, నాగేశ్వర్, ఉమ్మడి వరంగల్ విరసం కన్వీనర్ కోడం కుమార్, సీనియర్ జర్నలిస్ట్ ఎన్. వేణుగోపాల్, చిన్నయ్య, పౌరహక్కుల నేత ప్రొఫె సర్ లక్ష్మణ్, నారాయణ రావు, ప్రొఫెసర్ కాత్యాయనీ, లంక పాపిరెడ్డి, జిటా బాల్రెడ్డి, ఏ నరసింహారెడ్డి, బి.ఎన్.శర్మ తదితరులు పాల్గొన్నారు.

రేణుక (మిడ్కో)కు నివాళి

 మహబూబాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): మావోయిస్టు నాయకురాలు విప్లవ రచయిత్రి కడవెండి గ్రామానికి చెందిన రేణుక అలియాస్ మిడ్కో కు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జనగామ జిల్లా కమిటీ నివాళులర్పించింది. రేణుకా అంత్యక్రియల్లో ఆ పార్టీ జిల్లా కమిటీ పాల్గొంది రేణుక మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు జనగాం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గుమ్మడి రాజుల సాంబయ్య మాట్లాడుతూ విప్లవాల పుటిగడ్డపై జన్మించి విప్లవోద్యమంలో సుదీర్ఘకాలం పనిచేసే రేణుక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ప్రజల ముందు ఉంచారని తెలిపారు.

పీడిత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించి నమ్ముకున్న సిద్ధాంతం కోసం తుది శ్వాస విడిచే వరకు యుద్ధ రంగంలో నిలిచిందని ఆమె సేవలను కొనియాడారు. రచయిత్రిగా సాహిత్యంలో తనకంటూ ఒక గుర్తింపు సాధించి విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అటుపోట్లను ఎదుర్కొని తెలంగాణ ప్రజల దిక్కారాన్ని, ఈ ప్రాంత విప్లవ వారసత్వాన్ని చాటి చెప్పిందని గుర్తు చేశారు.

ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తమ బిడ్డలపై యుద్ధం చేస్తుందని, కుట్రపూరితంగా ఎన్కౌంటర్లకు పాల్పడుతుందని విమర్శించారు. వారి వెంట ఆ పార్టీ జిల్లా నాయకులు జీడి సోమయ్య, తూర్పాటి సారయ్య,గ్యారా రాజు మోకు దెబ్బ రాష్ట్ర కార్యదర్శి నలమాస రమేష్ .ఉద్యమ కారుల సంఘం జిల్లా నాయకులు సాంఘి వెంకన్న. ఉమాకర్ ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.