calender_icon.png 12 October, 2024 | 4:51 AM

గ్రీజ్‌మన్ వీడ్కోలు

01-10-2024 12:00:00 AM

పారిస్: ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాలర్ ఆంటోని గ్రీజ్‌మన్ సోమవారం అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 10 ఏళ్ల పాటు ఫ్రాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన గ్రీజ్‌మన్ 137 మ్యాచ్‌లాడి 44 గోల్స్ సాధించాడు. 2018లో ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్ నెగ్గిన జట్టులో గ్రీజ్‌మన్ సభ్యుడిగా ఉన్నాడు. ఆల్‌టైమ్ స్కోరర్ జాబితాలో ఫ్రాన్స్ తర ఫున గ్రీజ్‌మన్ నాలుగో స్థానంలో ఉన్నాడు.

2104లో నెదర్లాండ్స్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ ద్వారా మిడ్‌ఫీల్డర్‌గా అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన గ్రీజ్‌మన్ ఫ్రాన్స్ తరఫున అత్యధిక మ్యాచ్‌లాడిన ఆటగాళ్ల జాబితాలో నిలిచాడు. గ్రీజ్‌మన్‌తో పాటు హ్యూగో లోరిస్, లిలియన్ థురమ్‌లు మాత్రమే ఫ్రాన్స్ తరఫున ఎక్కువ సంఖ్యలో మ్యాచ్‌లు ఆడారు.