దాదాపు 18 సంవత్సరాల పాటు భారత హాకీ జట్టులో మూల స్తంభంలా నిలిచిన గోల్ కీపర్ పరట్టు రవీంద్రన్ శ్రీజేశ్ ఒలింపిక్స్‌లో పతకంతో తన కెరీర్‌ను ఘనంగా ముగించాడు. భారత్ తరఫున 2006లో అంతర్జాతీయ హాకీ కెరీర్‌ను ప్రారంభించిన శ్రీజేశ్ 328 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. శ్రీజేశ్ గోల్ కీపర్‌గా ఉన్న సమయంలోనే భారత హాకీ జట్టు 2020 టోక్యో ఒలింపిక్స్ కాంస్యం నెగ్గింది. 2014, 2022 ఆసియన్ క్రీడల్లో స్వర్ణపతకాలు సాధించిన జట్టులో శ్రీజేశ్ సభ్యుడిగా ఉన్నా డు. రైతు కుటుంబంలో జన్మించిన శ్రీజేశ్ స్ప్రింటర్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టి హాకీ గోల్ కీపర్‌గా మారడం విశేషం.