calender_icon.png 18 March, 2025 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెయింట్ పాల్స్ పాఠశాలలో 10 తరగతి విద్యార్థుల వీడ్కోలు ఉత్సవం

17-03-2025 08:15:24 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం  సెయింట్ పాల్స్ పాఠశాల ఆవరణలో 27 వ బ్యాచ్ అయిన పదవ తరగతి విద్యార్థులకు సోమవారం ఘనంగా వీడుకోలు ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పట్టణ సిఐ బి. రమేష్ విద్యార్థులనుద్దేశించి రేపటి భావి భారతంలో మీరు ఉన్నతమైన వ్యక్తిగా ఆదరణ గౌరవం పొందాలంటే విద్యార్థిగా ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి లక్ష్య సాధన వైపు ప్రయాణం చేయాలని సూచించారు. గత 33 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో రాణిస్తున్న విద్యార్థులను అందిస్తున్న పాఠశాల యాజమాన్యం అయిన డాక్టర్ కే అబ్రహం   డాక్టర్ కే రాధా మంజరి  అభినందించారు.

అలాగే విద్యార్థులకు వారి భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవాలని ఆశీర్వదించారు. అనంతరం గౌరవ అతిథి అయినా స్థానిక ఎస్ ఐ ఆఫ్ పోలీస్ శ్రీమతి విజయలక్ష్మి మాట్లాడుతూ... నా విజయం నా హక్కు అనే ఆలోచన ప్రతి విద్యార్థి దృఢంగా పెంపొందించుకొని రాబోయే పరీక్షల్లో విజయం మాత్రమే లక్ష్యంగా సాధించాలని ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయరాదని విద్యార్థులకు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు.

ఇదే క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డాక్టర్ కే రాధా మంజరి ,ప్రిన్సిపల్ డాక్టర్ కే అబ్రహం  విద్యార్థులకు 10 పై చిలుకు సంవత్సరం విద్యనభ్యసించి మొదటిగా ఒక ఉన్నతమైన శిఖరాన్ని చేరే మార్గంలో మొదటిసారిగా ఒక పరీక్షను ఎదుర్కోబోతున్న విద్యార్థులకు అన్ని విషయాల్లో విజయం సాధించి తల్లితండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు. పాఠశాల డైరెక్టర్లయిన శ్రీ ఎస్ రాజేష్ , శ్రీమతి డాక్టర్ అలీనా శాంతి గ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి విజయం కేవలం మార్కులు మాత్రమే కాదని ఇది ఒక ప్రత్యేక గుర్తింపుని సూచిస్తూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులు అందరినీ అభినందించి ఆశీర్వదించారు.