calender_icon.png 19 March, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

18-03-2025 10:44:59 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కోనాపూర్ జెడ్పీ హైస్కూల్ లో మంగళవారం పదో తరగతి విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శేఖర్ మాట్లాడుతూ... విద్యార్థులు పరీక్షలు బాగా రాసి ఉత్తమ మార్కులు సాధించాలన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచిపేరు తేవాలన్నారు. అనంతరం విద్యార్థుల ఆట, పాటలతో ఉల్లాసంగా గడిపారు.