calender_icon.png 13 March, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎనిమిదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు

13-03-2025 12:02:06 AM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం మొడేగాం గ్రామంలో బుధవారం మండల ప్రాథమిక ఉచ్ఛతర పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్థుల వీడుకోలు సమావేశం నిర్వహించారు. ఈ వీడ్కోలు సమావేశానికి హాజరైనటువంటి కల్వరాల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జై విష్ణువర్ధన్ రెడ్డి   విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదువుకొని గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చి తమ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచిం చారు.ఈ సమావేశంలో మోడెగాం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.