17-02-2025 08:22:20 PM
కాగజ్ నగర్ (విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని వివేకానంద జూనియర్ కళాశాలలో సోమవారం ఫేర్వెల్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ హనుక్ మాట్లాడుతూ... వార్షిక పరీక్షలు సమీపిస్తుండటంతో సమయాన్ని సద్వినియోగం చేసుకొని చక్కటి ఫలితాలు సాధించాలని కోరారు. తమ కళాశాలలోని విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన చదువులను నేర్పించినట్లు వివరించారు.
చక్కటి ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులకు, కళాశాలతో పాటు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ కోర్సుల్లో చక్కటి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా బహుమతులను అందజేశారు. అనంతరం విద్యార్థులు వివిధ పాటలపై నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.