25-02-2025 05:37:50 PM
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లెందు పట్టణం సాహితి కళాశాలలో మంగళవారం జరిగిన ఫేర్ వెల్ డే వేడుకలు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో అంబరాన్ని అంటాయి. కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఇల్లందు డిఎస్పి ఎన్. చంద్రభాను హాజరై మాట్లాడుతూ... విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని తెలిపారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలు పట్ల ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కనుక విద్యార్థులు వారి తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకొని ముందుకు అడుగు వేయాలని వివరించారు. సివిల్స్ వైపు దృష్టి పెట్టమని సూచించారు.
మరో ముఖ్య అతిథి ఇల్లందు మున్సిపల్ కమిషనర్ సిహెచ్. శ్రీకాంత్ మాట్లాడుతూ... సమయం అందరికీ ఒకేలా ఉంటుంది. విద్యార్థులు ముఖ్యంగా ఉన్నత శిఖరాలను చేరాలని, వారు సమయం వృధా చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇల్లందు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్. రామలింగేశ్వర రావు మాట్లాడుతూ... విద్యార్థులు మంచిగా చదివి, పరీక్ష సెంటర్ కు ముందుగానే చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు ఎంసి నాగిరెడ్డి, కేఎస్ వీ సుధాకర్, ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ... విద్యార్థులు విలువైన సమయాన్ని వృధా చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గుజ్జర్లపూడి రాంబాబు, అధ్యాపక, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.