calender_icon.png 19 April, 2025 | 12:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాగ్దేవిలో ఫేర్వెల్ హంగామా

17-04-2025 07:14:57 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల ఫేర్వెల్ పార్టీ వేడుకలు మంచిర్యాల గార్డెన్స్ లో గురువారం ఘనంగా నిర్వహించారు. కళాశాల కరస్పాండెంట్ పెట్టం మల్లేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు. అనంతరం పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.