calender_icon.png 21 January, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

26 ఏళ్లకే వీడ్కోలు

30-08-2024 12:00:00 AM

  1. ఆసీస్ క్రికెటర్ 
  2. విల్ పుకోవ్‌స్కీ

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెటర్ విల్ పుకోవ్‌స్కీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. వైద్యుల  సలహా మేరకు పుకోవ్‌స్కీ 26 ఏళ్ల వయసులోనే అర్థంతరంగా తన కెరీర్‌ను ముగించాల్సి రావడం గమనార్హం. ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ లోనే కంకషన్‌కు గురైన  పుకోవ్ స్కీ ఆ తర్వాత అతడి  తలకు 12 మార్లు బంతి తగిలింది. పదే పదే కంకషన్‌కు గురవ్వడంతో పాటు తలకు గాయాలు ఎక్కువైనట్లు వైద్యులు అతడి రిపోర్టులో ధృవీక రించారు. దీంతో పుకోవ్‌స్కీ ఆటకు వీడ్కో లు పలకక తప్పలేదు. ఇక  2021లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన పుకోవ్‌స్కీ కేవలం ఒక్క టెస్టు మ్యాచ్‌కే పరిమితమయ్యాడు.

2021లో భారత్ ఆస్ట్రే లియా మధ్య బోర్డర్ ట్రోఫీలో టెస్టు ద్వారా క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన పుకోవ్‌స్కీ తొలి మ్యాచ్‌లోనే 61 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే అశ్విన్ బౌలింగ్‌లో గాయపడిన పుకోవ్ స్కీ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. ఆ తర్వాత అతడి కెరీర్‌లో అదే చివరి టెస్టు మ్యాచ్ అవుతుందని కూడా పుకోవ్ స్కీ ఊహించి ఉండడు.  ఆ తర్వాత దేశవాలీ క్రికెట్‌లోనూ పలు సందర్బాల్లో అతడి తలకు బంతి తగిలింది.

స్వల్ప కెరీర్‌లో ఈ యంగ్‌స్టర్ తలకు బంతి సుమారు 12 పర్యాయాలు బలంగా తాకింది. దీంతో ఒత్తిడి, మానసిక ఆందోళనలతో సతమతమయ్యాడు. అసాధారణ ప్రతిభ ఉన్నప్ప టికీ గాయాలు అతడి కెరీర్‌ను నాశనం చేశాయి. ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో అదరగొట్టిన పుకోవ్ స్కీ 36 మ్యాచ్‌ల్లో ఏడు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలతో 2350 పరుగులు చేశాడు. సంచలన ఇన్నింగ్స్‌లతో అలరించి జాతీయ జట్టులోకి ఎంపికైన పుకోవ్ స్కీ.. కంకషన్ కారణంగా అతడి ఉజ్వల భవిష్యత్తు ఇలా ముగియడం ఆసీస్ సెలక్టర్లకు, అభిమానులకు మింగుడుపడని అంశంగా మారింది.