- బోటింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్న పర్యాటకులు
ప్రాజెక్టు వద్ద కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు
టూరిజం హోటల్ ఉన్నా సౌకర్యాలు నిల్
సంగారెడ్డి, జనవరి 9 (విజయక్రాంతి): సింగూరు ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటి మట్టం ఉండడంతో పర్యాటకులను ఆకట్టు కుంటుంది. మంజీరా నదిపై సింగూరు ప్రాజెక్టు నిర్మాణం చేసి పర్యాటకుల కోసం గతంలో సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం సింగూర్ ప్రాజెక్ట్ వద్ద పర్యాటకులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 29 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్న ప్రాజెక్టులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయలేదు.
జలాశయం అందాలు పర్యాటకుల మనసు కట్టుపడేస్తు న్నాయి. చుట్టూ పచ్చని పైర్లు అహ్లాదక రమైన వాతావరణంతో ప్రకృతి రమణీ యంగా మారిపోయింది. ఓవైపు జల పర వళ్లు మరోవైపు గేట్లపై నుంచి గలగల పారుతున్న నీటి సవ్వడులు, జలాశయం పై భానుడి కిరణాలు మనసుకి ఆహ్లాదాన్ని ఉంచడంతో కోనసీమ అందాలు తలపిస్తు న్నాయి.
ప్రతి ఏడాది సింగూరు ప్రాజెక్టు చూసేందుకు పర్యటకుల సంఖ్య పెరుగు తున్న ప్రభుత్వం అక్కడ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. పర్యాటక శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో అభి వృద్ధికి నోచుకోవడం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి.
పర్యాటక రంగానికి దూరం..?
సింగూరు ప్రాజెక్టు చూసేందుకు ప్రతి రోజు హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ తో పాటు కర్ణాటకకు చెందిన పర్యటనలు వస్తుం టారు. పర్యటకుల సంఖ్య పెరుగుతున్న ప్రాజెక్టు వద్ద కనీస సౌకర్యాలు లేక పోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. ప్రాజెక్టు చూసి ఎందుకు వచ్చే మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రాజెక్టు వద్ద తాగునీటి సౌకర్యం, మూత్ర శాలలు లేకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రాజెక్టుకు ఇరువైపు లా కట్టపై కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రమాదకరంగా మారిపోయింది. పర్యాట కుల సంఖ్య పెరిగిన కట్టపై కనీస సౌక ర్యాలు కల్పించడం లేదు. పర్యటకులు మనశ్శాంతి కోసం ప్రాజెక్ట్ వద్దకు వచ్చిన ఇబ్బం దులు తప్పడం లేదు. పర్యటక శాఖ అధికారులు ప్రాజెక్టు వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు పలుమార్లు కోరిన వారు పట్టించుకోవడం లేదు.
ప్రాజెక్ట్ కు వచ్చే ప్రజలకు వాహనా లు నిలిపేందుకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. బోటింగ్ సౌకర్యం కల్పించాలని పర్యటకు లు కోరుతున్న టూరిజం శాఖ పట్టించు కోవడం లేదు. సింగూర్ ప్రాజెక్టులో పుష్క లంగా నీరు ఉండడంతో ఓటింగ్ సౌకర్యం కల్పిస్తే ఎంతో మేలు ఉంటుందని సందర్శ కులు తెలుపుతున్నారు. గతంలో ప్రాజెక్టు వద్ద ఓటింగ్ సౌకర్యం ఉండడంతో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు యువకులు నీటిలో బోటింగ్ చేసేందుకు ఆసక్తి చూపేవారు.
ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉన్న పర్యాట క శాఖ బోటింగ్ సౌకర్యం కల్పించకపో వడంతో ప్రాజెక్టు వద్ద వచ్చేవారు నిరాశ చెందుతున్నారు. దీపాన్ని తలపించేలా ప్రాజెక్టు నీటి మధ్యలో కొండలు ఉన్న బోటింగ్ సౌకర్యం కల్పించడం లేదు. చు ట్టూ నీరు మధ్యలో కొండలు కనిపిస్తుం టాయి. బోటింగ్ లో ప్రయాణిస్తే సముద్రం లో ప్రయాణించే అనుభూతి కలుగుతుం దని పర్యటకులు అంటున్నారు.
ప్రాజె క్టులో నీటిమట్టం పూర్తిస్థాయిలో ఉండడం తో నీటితో కళకళలాడుతుంది. సూర్యోద యం, సూర్య స్తమయం సమయాలలో రమనీయ దృశ్యాలు కనువిందు చేస్తు న్నాయి. ప్రాజెక్టు చూసేందుకు వచ్చి న పర్యాటకులు తమ సెల్ ఫోన్ లో రమణీయమైన దృశ్యా లను తీసుకుంటున్నారు. పండగలు వారాంతపు సెలవుల్లో పర్యటన భారీ సంఖ్యలో ప్రాజెక్టు చూసేం దుకు వస్తున్నారు.
టూరిజం హోటల్లో కనీస సౌకర్యాలు కరువు ..?
సింగూర్ ప్రాజెక్టు వద్ద పర్యటకశాఖ టూరిజం హోటల్ ఏర్పాటు చేసిన అక్కడ కనీస సౌకర్యాలు లేవని ఆరోపణలు ఉన్నా యి. పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన హోటల్లో కనీస సౌకర్యం లేకపోవడంతో పర్యాటకులు ప్రైవేటు హోటల్‌కు వెళ్లి భోజ నాలు చేసే పరిస్థితి ఉంది రాష్ర్ట ప్రభుత్వం టూరిజం హోటల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో పెద్ద ప్రాజెక్టు ఉన్న అక్కడ సౌక ర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టూరిజం శాఖ ప్రాజెక్టు వద్ద పర్యాటకుల కోసం కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ప్రాజెక్టు వద్ద ఉన్న హోటల్లో సౌకర్యాలు కనిపిస్తే టూరిజం శాఖకు మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.