calender_icon.png 23 December, 2024 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోరలు చాస్తున్న రేబీస్

28-09-2024 12:00:00 AM

నేడు ప్రపంచ రేబీస్ దినోత్సవం :

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 70,000 మంది రేబీస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు, వీరిలో 40శాతం మంది పిల్లలే ఉంటారు. మానవుల రేబీస్ మరణాలలో 99శాతం కుక్క కాటువల్లే సంభవిస్తున్నాయి.

ఏపీ సీఆర్‌ఐ డేటా ప్రకారం, భారతదేశం లో ప్రతి సంవత్సరం సుమారు 1.7 కోట్ల కు క్కల కాట్లు సంభవిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రేబీస్ మరణాలు, పట్టణ ప్రాం తాల కంటే 10 రెట్లు ఎక్కువ. కాటుకు గుర య్యే బాధితులలో సుమారు 40శాతం మం ది 15 సంవత్సరాల లోపు పిల్లలే. డబ్ల్యూహెచ్‌ఓ అంచనాల ప్రకారం గత ఐదేళ్లలో దేశం లో సుమారు  లక్ష మంది రేబీస్ వల్ల మరణించారు.

రేబీస్ మరణాల విషయంలో భా రత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.  రేబీస్ అనేది ఒక ప్రమాదకరమైన వైరల్ వ్యా ధి. క్రూరమైన జంతువు కాటు లేదా గీత వల్ల రేబీస్ వైరస్ వ్యాపించి, కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది మెదడు వాపును కలిగించి, తగిన చికిత్స లేకపోతే మ రణానికి దారితీస్తుంది. రేబీస్ ప్రాణాంత కం అయినప్పటికీ, నివారించదగినది. టీకా ద్వా రా చాలా దేశాలలో ఈ వైరస్ నియంత్రణ లో ఉంది.

ప్రపంచ రేబీస్ దినోత్సవం ఏటా సెప్టెంబర్ 28న జరుపుకుంటారు. రేబీస్‌పై అవగాహన పెంచడం, టీకాల ప్రాముఖ్యతను గుర్తించడం,అంతేకాక మొదటి రేబీస్ టీకా ఆవిష్కర్త లూయిస్ పాస్టర్ జన్మదినాన్ని స్మరించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. భారత ప్రభుత్వం, అనేక సంస్థలు కుక్కలకు టీకాలు వేయడం, ప్రజలలో అవగాహన కల్పించడం, గ్రామీణ ప్రాంతాల్లో రేబీస్ చికిత్సను మెరుగుపరచ డం కోసం చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ప్రయత్నాలు రేబీస్ నియంత్రణలో కీలకంగా నిలుస్తాయి. 

 డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ