calender_icon.png 24 April, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతోన్మాదులను కఠినంగా శిక్షించాలి

24-04-2025 07:38:25 PM

బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్...

మందమర్రి (విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పహల్గాం యాత్రికులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వారి మరణానికి కారకులైన మతి లేని మతోన్మాదుల పిచ మనచాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బిఎస్సి ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పహల్గాం మృతుల కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

దేశ నిఘా వ్యవస్థలను పటిష్టం చేసి, భద్రత సలహాదారులను మార్చాలని సూచించారు. అదేవిధంగా ఈ ఘటనకు కారకులైన ముష్కరులు ప్రపంచంలో ఏ మూలన దాక్కున అంతమొందించాలని, మతోన్మాదులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదంతో అనగదొక్కాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ పట్టణ అధ్యక్షుడు గాజుల శంకర్, మండల అధ్యక్షులు ఎండి మతిన్ ఖాన్,  నాయకులు ఐలేని రాజు లు పాల్గొన్నారు.