26-04-2025 08:36:30 AM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలంలోని(Bhadrachalam) కరకట్ట రోడ్ లోని ఒక ప్రైవేటు లాడ్జ్ నందు కొంత మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు నూతనంగా సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జి. స్వప్న పోలీస్ సిబ్బంది కలిసి పేకాట శిబిరం పై దాడి చేసి పేకాట(poker players) ఆడుతున్న 5 గురు ప్రముఖ వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో బాచినేని రామకృష్ణ, ఎ. ఎస్. రాములు, సర్వ శ్రీహరి, మాదినేని వెంకటేశ్వర రావు, ఏడ్లపల్లి నరసింహ రావు లను అదుపులోకి తీసుకొని తదుపరి పంచనామా చేసి వారి వద్ద నుండి10,750 రూపాయల నగదు ను, 7 మరియు 52 పేక ముక్కలను లను స్వాధీనపర్చుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.