calender_icon.png 30 December, 2024 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యపానంతో కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తం..

11-10-2024 03:14:29 PM

కరీంనగర్, (విజయక్రాంతి): మద్యపానంతో కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంను పురస్కరించుకొని తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని అశోక్ నగర్ లో ప్రకృతి ఐ ఆర్ సి ఏ డి- అడిక్షన్ , రిహాబిలిటేషన్  సెంటర్లో 'మానసిక ఆరోగ్యం పై ఆల్కహాల్ ప్రభావం' అనే అంశంపై ఇంటరాక్టీవ్  సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. మద్యపానం సేవించడం ఆరోగ్యానికి ఎంతో హానికరమని, క్షణకాల ఆవేశంతో మద్యపానం సేవిస్తూ కుటుంబంలో కలహాలకు కారణం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి చిన్న సమస్యగాని, సంతోష సమయాలలో అధికంగా  మద్యపానం సేవిస్తూ  ఇంటితో పాటు సమాజంలో అశాంతి కారణం అవుతున్నారని అన్నారు. దృఢమైన మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉంటే అన్ని  దురల వాట్ల నుంచి విముక్తి పొందే  అవకాశం ఉంటుందని అన్నారు.మద్యపానం మానివేసి కుటుంబము సమాజ క్షేమం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.

ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి మనసుని ఆయుధంగా మలుచుకోవాలని సూచించారు. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ రిసోర్స్ పర్సన్ గాలిపల్లి నాగేశ్వర్ మాట్లాడుతూ.. మద్యపానం ఉంచి విముక్తి పొందడానికి విహబిలిటేషన్ సెంటర్ ద్వారా తమ సేవలు అందిస్తున్నామని అన్నారు. మంచి ఆరోగ్యం కోసం మద్యపానంను సంపూర్ణంగా వదిలిపెట్టి ఆరోగ్యకరమైన పరిస్థితులు సృష్టించుకుని పనులు చేపడుతూ కుటుంబం, సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు పొందాలని సూచించారు.. మద్యపానం నుండి విముక్తి పొందడం కోసం  ప్రత్యేక శిక్షణ చికిత్స , అవగాహనను కలిగిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆ సెంటర్లో ఉన్న వ్యక్తులకు సమస్యలను అడిగి తెలుసుకొని బ్రతుకుపై భరోసా కల్పించారు. కార్యక్రమంలో కల్పన మౌనిక శోభ శ్రీనివాస్ శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.