calender_icon.png 14 November, 2024 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబ సర్వే సజావుగా సాగాలి

12-11-2024 02:01:33 AM

టీఎస్ యూటీఎఫ్

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): సర్వేకు ప్రజలు సహ కరించేలా ప్రభుత్వం విస్తృత ప్రచారం చేయాలని టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షు డు జంగయ్య, ప్రధాన కార్యదర్శి రవి సోమవారం సూచించారు. ప్రభుత్వం చేపట్టిన కులగణనపై నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం చెప్పిన మాటలకు భిన్నంగా విధులను కేటా యించారన్నారు. కొందరు కలెక్టర్లు, అధికారులు ఉపాధ్యాయులకు టార్గె ట్లు పెడుతున్నారన్నారు. డిప్యూటీ సీఎం, ప్రణాళికా శాఖ అధికారులు జోక్యం చేసుకొని సర్వే సజావుగా సాగే లా చూడాలని డిమాండ్ చేశారు.

ఈమేరకు డిప్యూటీ సీఎం భట్టి, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీ ప్‌కుమార్ సుల్తానియా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు లేఖలు రాశారు.