calender_icon.png 3 December, 2024 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర కుటుంబ సర్వే ఎంట్రీ పక్కగా చేపట్టాలి

21-11-2024 02:20:49 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి, (విజయక్రాంతి): సమగ్ర కుటుంబ సర్వే పక్కగా ఎంట్రీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్  అన్నారు. గురువారం సదాశివ నగర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సందర్శించారు. అక్కడ సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ తీరని పరిశీలించారు. ప్రతి వ్యక్తి ప్రతి అంశం సంబంధించిన సేకరించిన వివరాలు పక్కగా డాటా ఇంటిలో నమోదు చేయాలని అన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా ఒకటికి రెండుసార్లు పరిశీలించి నమోదు చేయాలని ఆపరేటర్లకు సూచించారు. సంబంధిత అధికారులు పరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్ కుమార్, జెడ్పిసిఈఓ చందర్ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.