calender_icon.png 10 January, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబం ఆత్మహత్యాయత్నం

05-01-2025 01:20:02 AM

* నిర్మల్ మున్సిపల్ ఆఫీసు ఎదుట ఆందోళన

* ఇంటి నిర్మాణం ఆపేసిన టీపీవో?

నిర్మల్, జనవరి 4 (విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీ టీపీవో హరీశ్ వేధింపులు భరించలేక మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం ఓ కుటుంబం పెట్రోల్ పో  ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలాన్ని రేపింది. పట్టణంలోని గాంధీ చౌక్‌కు చెందిన శంకరీ రమేశ్, సతీశ్, శ్రీకాంత్ అన్నదమ్ములు.

వారికి గాంధీచౌక్‌లో వారసత్వంగా వచ్చిన ఇల్లు ఉండగా.. పెద్దవాడైన శంకరీ రమేశ్ దంపతులు ఆ ఇంటిని కూల్చి, కొత్త ఇంటి నిర్మా  చేపట్టారు. మొదటి అంతస్తు పూర్తి కాగా రెండవ అంతస్తు పనులు కొనసాగుతున్నా  దీనికి అనుమతులు తీసుకుని పనులు చేస్తున్నారు.

కొందరు అభ్యంతరం తెలుపడంతో అనుమతులకు సంబంధించిన అన్ని పత్రాలు మున్సిపల్ టీపీవో హరీశ్‌కు చూ  అయినా కూడా నాలుగు నెలలు  ఆ ఇంటి వద్దకు వెళ్లి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేధింపులకు గురి  ఆరోపించారు.

డబ్బులు ఇవ్వకపోవడంతో శనివారం పనులు నిలిపివే  చెప్పారు. దీంతో రమేశ్ దంపతులు తమ అన్నదమ్ముల కుటుంబీకు  సతీశ్ శ్రీకాంత్ దంపతులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పెట్రోల్ పోసుకునేందుకు యత్నించగా అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు పెట్రోల్ డబ్బాను లాగేసుకున్నారు.

నాలుగు నెలలుగా టీపీవో వేధింపులు భరించలేక తీవ్ర మనోవేదన చెందుతున్నామని, ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చిన అధికారులు ఇప్పుడు పనులు ఆపడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్పిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎస్సై హన్మండ్లు అక్కడికి చేరుకుని సమస్య పరిష్కారానికి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. 

ఆందోళనకు కౌన్సిలర్ మద్దతు 

స్థానిక కౌన్సిలర్ మేడారం అపర్ణ బాధితులకు మద్దతుగా వారితో కలిసి ధర్నా చేశారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కమిషనర్ అహ్మద్ ఖమార్ అక్కడికి చేరుకుని సముదాయించినా వినలేదు. టీపీవోపై చర్యలు తీసుకుని, న్యాయం చేయాలని కోరారు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటామన్నారు. న్యాయం చేస్తామని పోలీసులు హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.