19-04-2025 10:49:35 PM
బచ్చన్నపేట్ (విజయక్రాంతి): భారీగా వీచిన ఈదురు గాలులకు ఓ ఇంటి పైకప్పు లేచిపోయిన సంఘటన బచ్చన్నపేట మండలంలోని శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బచ్చన్నపేట మండలంలోని కేసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కందారపు రాజమౌళి- భవాని దంపతులు నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టి అందులోని తన ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఈదురు గాలులు భారీగా రావడంతో పైన ఉన్న రేకులు మొత్తం ఎగిరి కొంత దూరంలో పడ్డాయి. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎవరికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఉండటానికి ఇంటి పైకప్పు లేచిపోవడంతో బాధిత కుటుంబ రోడ్డున పడ్డారు. దింతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని వారికి భరోసానిచ్చారు. ఆర్థిక పరంగా నష్టపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.