7ఏళ్ల వయసులో కిడ్నాప్ అయిన బాలుడు
న్యూఢిల్లీ, నవంబర్ 28: ఏడేళ్ల వయసులో కిడ్నాప్‌కు గురైన బాలుడు దాదాపు 30ఏళ్ల తర్వాత తన కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్న ఘటన ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. 30ఏళ్ల క్రితం ఢిల్లీకి సమీపంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉన్న రాజు తన సోదరితో కలిసి బడికి వెళ్లి వస్తుండగా కిడ్నాప్ అయ్యాడు. తాజాగా కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న అతడు ఘజియాబాద్‌లోని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు వచ్చి రాజును ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం రాజు వయసు 37ఏళ్లు అని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా కిడ్నాప్ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.