30-03-2025 11:54:26 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా(Sathya Sai district)లో ఉగాది పండగ(Ugadi festival)పూట విషాదం చోటుచేసుకుంది. మడకశిరలో గాంధీ బజారులో ఉంటున్న బంగారం వ్యాపారి కృష్ణచారి(Gold merchant Krishnamachari) కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దంపతులు కృష్ణచారి, సరళమ్మ, కుమారులు సంతోష్, భువనేశ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. నలుగురు కుటుంబసభ్యులు ఇంట్లో విగత జీవులుగా పడిఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికులను అడిగి మృతుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.