13-04-2025 01:46:02 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్
ప్రముఖ పర్యావరణ కార్యకర్త, పద్మ శ్రీ వనజీవి రామయ్య మరణం బాధాకరమని కేంద్రమంత్రి బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. తన జీవితకాలంలో కోటి మొక్కలకుపైగా నాటి పర్యావరణ పరిరక్షణకు అపార సేవలు అందించిన రామయ్య.. కుటుంబ సభ్యులకు సైతం చెట్ల పేర్లను పెట్టడం ద్వారా పర్యావరణం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారని కొనియాడారు. రామ య్య సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును సత్కరించిందని చెప్పారు. రామయ్య మరణం తెలంగాణకు, పర్యావరణ సమాజానికి తీరని లోటు అని అన్నారు.