నిజామాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): ఆన్‌లైన్ బెట్టింగ్‌కు ఓ కుటుంబ బలయ్యింది. నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో రంగినేని సురేష్(53), హేమలత(45) దంపతుల కుమారుడు హరీష్ (22) ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. తల్లిదండ్రులకు తెలియకుండా రూ.40 లక్షల వరకు అప్పులు చేశాడు. సురేష్ దంపతులు అప్పులు తీర్చేందుకు తమకున్న 20 గుంటల భూమిని అమ్మేశారు.
అయినా మరో రూ.18 లక్షల వరకు అప్పులు ఉండటం, అప్పు ఇచ్చిన వారు వేధిస్తుండటంతో శనివారం ఉదయం ఇంట్లో కుమారుడితో సహా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎడపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో దినేశ్ అనే యువకుడు ఆనైలైన్ బెట్టింగ్‌లో రూ.కోటి పోగొట్టుకున్నాడు. బెట్టింగ్ కోసం చేసిన అప్పు తీర్చలేక తల్లిదండ్రులు, అక్కతోపాటు దినేశ్ కూడా పురుగుల మందు తాగాడు. తల్లిదండ్రులు చనిపోగా దినేశ్, అతడి అక్క చికిత్స పొందుతున్నారు.