calender_icon.png 8 February, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంలో సంతోషం

08-02-2025 12:00:00 AM

అదనపు కలెక్టర్ రాధిక గుప్తా 

మేడ్చల్, ఫిబ్రవరి 7(విజయ క్రాంతి): మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంలో సంతోషం ఉంటుందని అదనపు కలెక్టర్ రాధిక గుప్త అన్నారు. శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రొమ్ము, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ పై నిర్వహించిన హెల్త్ క్యాంపునకు అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, విజయేందర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు ఇంటి పనులు, కార్యాలయ విధులలో నిమగ్నమై ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తారన్నారు. ఇలాంటి క్యాంపులు ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కలెక్టరేట్ లో పనిచేసే ఉద్యోగినూలు క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రఘునాథ స్వామి, డిఆర్‌ఓ హరిప్రియ, లా ఆఫీసర్ చంద్రావతి, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ శిబిరంలో 224 మంది ఉద్యోగులు పరీక్షలు చేయించుకున్నారు. 61 మందికి సర్వైకల్, 124 మందికి ఓరల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు.