calender_icon.png 3 November, 2024 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబం సమాధి

05-08-2024 01:56:19 AM

వయనాడ్‌లో ఒకే కుటుంబంలో 15 మంది మృతి

వయనాడ్ (కేరళ), ఆగస్టు 4: కేరళలోని వయనాడ్‌లో కొండచరియ లు విరిగిపడి ప్రమాదంలో బాధితుల గుండెకోతకు అంతే లేకుండా పోతున్నది. చూరమల గ్రామంలో మన్సూర్ అనే వ్యక్తి తన కుటుంబంలో ఏకంగా 16 మందిని కోలో యిన ఒంటరిగా మిగిలాడు. కాగా, మటిదిబ్బలకింద ఇంకా ఎవరైనా బతికి ఉన్నారేమోనన్న అనుమానం తో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇప్పటికే మృతుల సంఖ్య దాదాపు ౪౦౦కు చేరింది. కాగా, సహాయ చర్యల్లో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ శనివారం చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. ఆయన వయనాడ్‌లో పర్యటించి బాధితులకు నిత్యావసర సరుకులు, సామగ్రి అందజేశారు. అదంతా ఓ వీడియో రూపంలో చిత్రీకరించిన ‘మెమరబుల్ డే(మరువరాని రోజు)’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ పోస్టుపై బీజేపీ నేత అమిత్ మాలవీయ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 3౫౦మందికి పైగా చనిపోతే నీకు మెమరబుల్ డేగా ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్తులు చిరస్మరణీయం ఎలా అవుతాయో చెప్పాలని నిలదీశారు.