calender_icon.png 21 March, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబ సమగ్ర సర్వే రెమ్యూనరేషన్ చెల్లించాలి

20-03-2025 04:19:58 PM

ఎన్యుమరేటర్ల ఆవేదన..

బెల్లంపల్లి (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుటుంబ సమగ్ర సర్వే ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు సర్వే రెమ్యూనరేషన్ డబ్బులను చెల్లించకపోవడం పట్ల ఎన్యుమారేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి పథకాన్ని పెట్టిన అందుకు సంబంధించిన సర్వేను బస్తీలలో ఇంటింటికి తిరిగి పూర్తి చేస్తున్నామని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు. ఇళ్లల్లో కుటుంబ యజమానులు లేకుంటే మళ్లీ మళ్లీ తిరిగి రాత్రనక పగలనక, పండుగలు, సెలవులను కూడా విస్మరించి సర్వే చేస్తే ఇప్పటివరకు రెమ్యూనరేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని మన ఆరోపిస్తున్నారు.

కుటుంబ సమగ్ర సర్వే పూర్తిచేసే నాలుగు నెలలు గడుస్తున్న ఇంతవరకు సర్వే డబ్బులు ఇవ్వకపోవడం తమను ఆవేదనకు గురి చేస్తుందన్నారు. సర్వేలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగులు, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు పాల్గొని కష్ట కాలంలో సర్వేను పూర్తి చేసినప్పటికీ సర్వే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కుటుంబ సమగ్ర సర్వే రెమ్యూనరేషన్ రెమ్యూనరేషన్ డబ్బులను ఇప్పించాలని ఎన్యుమరేటర్లు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.