calender_icon.png 28 October, 2024 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలుగు వరదలో చిక్కుకున్న కుటుంబం

01-09-2024 12:51:46 PM

ఒక్కరిని కాపాడిన పోలీసులు రెవిన్యూ సిబ్బంది.

మిగతా ముగ్గురు రేకుల ఇంటి పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూపు.

కాపాడటానికి శత విధాలుగా ప్రయత్నస్తున్న రెవెన్యూ, పోలీస్ సిబ్బంది.

ఖమ్మం, (విజయక్రాంతి) : నిన్నటి నుండి ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లా పాలేరు జలాశయం అలుగు పారుతుండగా రోడ్డు మీదకు చేరిన అలుగు వరద నీరు ఉదృతంగా ప్రవహించడం తో  అక్కడ పెట్రోల్ బంక్ పక్కన ఇటుకలు చేస్తూ నివసిస్తున్న కుటుంబం తో పాటు పెట్రోల్ బంక్ లో పని చేసే యువకుడు వరద లో చిక్కు కున్నాడు. కాగా అప్రమత్తమైన రెవిన్యూ పోలీస్ సిబ్బంది వెంటనే పెట్రోల్ బంక్ లో పని చేసే యువకుడిని కాపాడగలిగారు.

కాగా ఇటుకలు చేసే కుటుంబం వరదలో చిక్కుకున్నారు. వారు రేకుల ఇంటి మీద ఎక్కి కూర్చున్నారు. కాగా వారిని నిన్న సాయంత్రం పూట రెవిన్యూ పంచాయతీ సిబ్బంది ఖాళీ చేయమని చెప్పిన వారు ఇళ్లు వదలి వెళ్ళక పోవడంతో ఇలా ప్రమాదం బారిన పడ్డారు. అంతే కాక వారు నిలబడి ఉన్న ఇళ్లు వరద తాకిడికి ఎంత సేపు తట్టుకొని ఉంటుందో లేక కూలిపోతుందో అని అంచనా వేస్తున్నారు.కాగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ నాయకన్ గూడెం వరద లో చిక్కుకున్న కుటుంబానికి డ్రోన్ సహాయంతో లైఫ్ జాకెట్ లను లైఫ్ సేవింగ్ ట్యూబ్ లను పంపించారు. కాగా వారిని ఎలా రక్షించాలో రెస్క్యూ టీమ్ తో సంప్రదిస్తున్నారు.

మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు అధికారులు హెలికాప్టర్ ను సంప్రదించిగా అది సిగ్నల్స్ క్లియర్ అయితేనే వచ్చే ఆస్కారం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. తహసీల్దార్ సురేష్ కుమార్ ఎస్ఐ నాగరాజు రెవెన్యూ, అన్ని ప్రభుత్వ శాకలు అక్కడే ఉండి సహాయక చర్యలు చెబడుతున్నారు.