05-04-2025 12:48:47 AM
ఖమ్మం, ఏప్రిల్ 4( విజయక్రాంతి ):- కుటుంబాలను,, సమాజాన్ని మాదక ద్రవ్యాలు విచ్చిన్నం చేస్తాయని, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటిని అరికట్టడం లో సామాజిక బాధ్యత తో వ్యవహరించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.మొహ్మద్ జాకిరుల్లా అన్నారు.శుక్రవారం విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు యాంటీ డ్రగ్స్ కమిటీ,ఐ.క్యూ.ఏ.సి,ఎన్.ఎస్.ఎస్ ,ఎన్.సి.సి విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన సే నోటూ డ్రగ్స్ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు.కార్యక్రమంలో యాంటీ డ్రగ్స్ కమిటీ కన్వీనర్ డా.కరీం,ఐ.క్యూ.ఏ.సి.కోఆర్డినేటర్ డా.ఎం.సునంద,ఎన్.సి.సి ఆఫీసర్ డా.ఓంకార్ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ డా.ఏ.ఆర్ సత్యవతి , అకడమిక్ కోఆర్డినేటర్ డా.బి.వీరన్న, అధ్యాపకులు డా.సర్వేశ్వరరావు,డా.శ్రీనివాస్.శరీన్,బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు