calender_icon.png 21 September, 2024 | 3:09 AM

ఉపాధ్యాయుడిపై తప్పుడు నివేదిక

21-09-2024 01:03:23 AM

జాయింట్ కలెక్టర్‌తో పాటు ఐదుగురు జిల్లా అధికారులపై కేసు

కుమ్రంభీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై  తప్పుడు నివేదకను ఇచ్చి, అతడి ఉద్యోగం పోవడానికి కారణమైన జిల్లా అధికారులపై కేసు నమోదైంది. మహమ్మద్ అష్రఫ్ నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం సాధించి, పదోన్నతి పొందాడని, అక్రమ సంపాదనతో ఇళ్లు ని ర్మించాడని గతంలో ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ చేసిన జిల్లా స్థాయి కమిటీ తప్పుడు నివేదిక  ఇవ్వడంతో అష్రఫ్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అష్రఫ్ కోర్టును అశ్రయించగా.. అష్రఫ్‌పై కేసును ఎత్తివేసింది. దీంతో అష్రఫ్ ఫిర్యాదు మేరకు అప్పటి జాయింట్ కలెక్టర్ రాజేశం, ఎస్సీ సంక్షేమాధికారి సంజీవన్, బీసీ సంక్షేమాధికారి సత్యనారాయణరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మైనార్టీ అధికారి షేక్ మహమూద్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఇంటర్ విద్యాధికారి శ్రీధర్‌లపై కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ సేషన్‌లో కేసు నమోదు చేశారు.