calender_icon.png 25 September, 2024 | 5:59 AM

సింగరేణిపై అసత్య ప్రచారం మానుకోవాలి

25-09-2024 03:52:27 AM

కనీస వేతన కమిటీ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): సింగరేణిపై బీఆర్‌ఎస్ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని కనీస వేతన కమిటీ బోర్డు చైర్మన్, ఐఎన్‌టీయూసీ నాయకుడు జనక్ ప్రసాద్ హితవు పలికారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి దసరా బోనస్‌గా రూ.1.90 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు.

సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టు కార్మికులకు కూడా రూ.5 వేల బోనస్ ఇచ్చారని ఆయన తెలిపారు. అధికారంలో ఉన్న పదేళ్లలో ఎన్నడూ సింగరేణి లాభాలను వెల్లడించని బీఆర్‌ఎస్ పార్టీ నేతలు..

నేడు సీఎం రేవంత్‌రెడ్డి సింగరేణిలో గనుల ద్వారా వచ్చిన లాభాల నుంచి కార్మికులకు పెద్దఎత్తున బోనస్ ఇస్తుంటే జీర్ణించుకోలేక కావలనే సీఎంపై విమర్శలు చేస్తున్నారని జనక్‌ప్రసాద్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నేతలు ఇదే వైఖరి కొనసాగిస్తే.. తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు.