07-02-2025 05:06:10 PM
బిజెపి జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధి పనులకు మంజూరు అయినా నిధులపై కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం హెచ్చరించారు. శుక్రవారం కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఇటీవల 10 కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ నిధుల మంజూరుకు ఎమ్మెల్యే కృషి చేస్తే ఎమ్మెల్సీ కృషి వల్లే విడుదల అయ్యాయని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఎమ్మెల్యే గత ఏడాది డిసెంబర్ లో ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీకి పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలో పంపించారని లేఖని చూపించారు. నిధులు మంజూరైన తర్వాత ఎవరికో పుట్టిన పిల్లలను తమ పిల్లలుగా చెప్పుకునే విధంగా కాంగ్రెస్ నాయకుల తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే హరీష్ బాబు అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని దీనిని సహించని కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధపు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.