calender_icon.png 12 March, 2025 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి

12-03-2025 12:32:22 AM

పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ 

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సూచించారు. ఎమ్మెల్యే కోటాలో బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్‌నాయక్‌తో పాటు సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం మంగళవారం పీసీసీ చీఫ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని సూచించారు. మిత్రపక్షమైన సీపీఐ కూడా కాంగ్రెస్‌కు సంపూర్ణ సహకారం అందించాలని, భవిష్యత్‌లోనూ రెండు పార్టీల మధ్య ఇదే మైత్రి కొనసాగాలని ఆకాంక్షించారు.