calender_icon.png 15 November, 2024 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్, హరీశ్‌వి తప్పుడు ప్రచారాలు

15-11-2024 01:31:13 AM

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి చేపడుతున్న ప్రతి పనినీ వారిద్దరూ వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియాతో విమర్శలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. లగచర్లలో కలెక్టర్‌పై దాడి చేయించి కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారన్నారు.

ఖమ్మంలో రైతులపై దాడి చేయించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. భూములు ఇవ్వకపోతే రైతుల సంగతి చూస్తామని నాటి మంత్రి దయాకర్‌రావు బెదిరించిన సంగతి ప్రజలకు తెలుసునన్నారు. లగచర్లలో బీఆర్‌ఎస్ నేతలే కలెక్టర్‌పై దాడి చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. భూములను గుంజుకోవడం తమ పాలసీ కాదన్నారు.