హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి) : విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల మనోధైర్యం దెబ్బతినేలా నాయకులు చేస్తున్న ప్రకటనలు మానుకోవాలని తెలంగాణ విద్యుత్ వర్కర్స్ యూనియన్ (బి గౌరవ సలహాదారులు రఘు హితవు పలికారు. తెలంగాణ విద్యుత్ వర్కర్స్ యూనియన్ (బీ సమావేశం మింట్ కాంపౌండ్‌లో సంఘం అధ్యక్షులు నాగరాజు అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా రఘు మాట్లాడు తూ గత ప్రభుత్వ హయంలో ఈ యూనియన్ కార్యాలయం మూడేళ్లు మూతపడిం దని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో తిరిగి అదే కార్యాలయాన్ని విద్యుత్ శాఖ కేటాయించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
రానున్న రోజుల్లో విద్యుత్ కార్మికుల సమస్యలపై ఉద్యమించేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చా రు. విద్యుత్ కార్మికుల సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అందుకు సంబం ధించిన కార్యచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళి, వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ ఖాదీర్ ఆలీ, ప్రధాన కార్యదర్శి నాగం సంతోష్ రెడ్డి, అడిషనల్ జనరల్ సెక్రటరీ ప్రశాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమే ష్, వెంకటేష్, లక్ష్మణ్, జైపాల్, రాజప్ప, హీతేందర్ కుమార్ పాల్గొన్నారు.