- రుణమాఫీపై సీఎం రేవంత్‌వి పచ్చి అబద్ధాలు
- పాలనను గాలికొదిలి సీఎం, మంత్రుల గాలిమోటర్ యాత్రలు
- అక్కడి ఎన్నికల్లో మా పార్టీ పోటీలో లేదు
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాం తి): ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు అబద్ధపు హామీలిచ్చి, అధికార పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో లేనిపోని కోతలు కోస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో ఏయో హామీలు నెరవేర్చారో చెప్పాల్సి ఉందని, అందుకు తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఆరు గ్యారెంటీలు ఉత్త గ్యారెంటీలని, పైగా 100 రోజుల్లో వాటిని అమలు చేస్తామని ఎచ్చులకు బాండ్ పేపర్ కూడా ఇచ్చారని ఎద్దేవా చేశారు. సీఎం సూటిగా రుణమాఫీపై మాట తప్పామని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలని సూచించా రు.
ప్రభుత్వం మాఫీ ప్రక్రియను ఆలస్యం చేయటంతో రైతులపై వడ్డీ భారం పడిందని ప్రకటించాలన్నారు. అలాగే రైతు భరోసా ఇచ్చారో లేదో చెప్పాలని, ధాన్యానికి రూ. 500 బోనస్ ఇచ్చారో లేదో కూడా చెప్పాల ని డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్లు కట్టకుండా, ఉన్న ఇండ్లను కూడా కూల్చేశామని, నిరుద్యోగులను రోడ్డున పడేశారని చెప్పాలని ఉద్బోధించారు. వృద్ధుల పెంచలేకపోయామనీ చెప్పాలన్నారు.
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పామని దర్జాగా ప్రకటించాలన్నారు. నిరుద్యోగులపై లాఠీచార్జి చేయించామని, అర్ధరాత్రి ఆడపిల్లల్ని అరెస్ట్ చేయించామని చెప్పాలని సూచించారు. రేవంత్ అక్కడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అక్కడికి డబ్బులు పంపించే పనిలో ఆయన బిజీగా ఉన్నారని ఆరోపించారు.
పాలన గాలికి వదిలి మంత్రు లు గాలిమోటర్లు ఎక్కే బాటపట్టారని ధ్వజమెత్తారు. అలాగే మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ పోటీలో లేదని స్పష్టం చేశారు. అక్కడి ఎన్నికల్లో తాము ఏ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ప్రచారం చేయమని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోళ్ల పేరుతో దగా..
రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని, ఇక రైతులకు మద్దతు ఎలా లభిస్తుందని హరీశ్‌రావు ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల పేరుతో సర్కార్ రైతులను దగా చేస్తుందని దుయ్యబట్టారు. గతిలేక రైతులు క్వింటా రూ.1,900కే ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత పాలనకు రోడ్ల మీద ఆరబోసిన వరి రాశులే సాక్ష్యమన్నారు. ఉచిత కరెంట్ ఇస్తున్నామని రాష్ట్రప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్తున్నదని మండిపడ్డారు. పంటలకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇచ్చిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.