12-02-2025 12:00:00 AM
తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న
తుంగతుర్తి, ఫిబ్రవరి 11: తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటినుండి నేటి వరకు ప్రతి గ్రామంలో గడపగడపకు తిరిగి నాయకులను కార్యకర్తలను పలకరించి వారి అభివృద్ధిలో భాగస్వామ్యం వ్యక్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు.
మంగళవారం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ... తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆయన సంప్రదించకుండానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులమని చెప్పుకుంటూ అగ్రకుల నాయకుల ఆదరాభిమానుల కోసం నియోజకవర్గ కోసం అహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తున్న ఎమ్మెల్యే పై ఉన్నది లేనట్టుగా చెప్పి వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ర్ట ప్రభు త్వంలో ఉన్న పెద్ద నాయకులకు ఎమ్మెల్యేపై తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ దొంగ చాటుగా పదవులు తెచ్చుకోవడమే కాకుండా ఎమ్మెల్యే పే అనుచిత వ్యాఖ్యలు చేయడం అర్ధ రహితమన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసే వ్యక్తులకు పార్టీ పదవులను ఎమ్మెల్యే అందించడం జరుగుతుందనిఅన్నారు.