కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు
కామారెడ్డి (విజయక్రాంతి): గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి కుట్రలు పన్నుతున్నారని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు ఆరోపించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఆదరణ చూసి ఇక టిఆర్ఎస్ పార్టీ అంతరించిపోతుందని భయపడి కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లు కుట్రలు ఫన్నీ ప్రభుత్వంపై ఫుడ్ పాయిజన్ చేయించి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
రైతు భరోసా ఇచ్చాం ఒకే దెబ్బ 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి 70 శాతం మంది రైతులకు లబ్ధి పొందేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఇంకా 3 వేల కోట్లు రైతు రుణమాఫీ చేయబోతున్నామన్నారు. దీనిపై కూడా రైతులకు రుణమాఫీ కాలేదని కుట్ర పన్నుతున్నారు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి కాస్మోటిక్ చార్జీలను పెంచడంతో పేద విద్యార్థుల్లో విద్య పట్ల ప్రభుత్వ చర్యల పట్ల ఆసక్తి విశ్వసనీయత పెరిగిందన్నారు. దీన్ని దెబ్బతీసేందుకే ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు విద్యార్థుల్లో ఆత్మ తైర్యాన్ని దెబ్బతీసేందుకు టిఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న భారీ కుట్రనే ఈ ఫుడ్ పాయిజన్ కేసులని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఇష్టం ఉన్నట్లు దోచుకున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి దోచుకుని నాశనం చేశారని ఆరోపించారు.
లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీశారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని రకాల హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందన్నారు. 50 వేల ఉద్యోగాలు 10 నెలలలో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని అన్నారు. పది ఏళ్లలో టిఆర్ఎస్ చేయలేని పనులు ఒక సంవత్సరంలోనే చేసి చూపించిందన్నారు. ఇచ్చిన హామీల ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంట్, 500 రూపాయలకే సిలిండర్ ఆరోగ్యశ్రీ పథకాలు లాంటి అనే సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్లరాజు, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనే శ్రీనివాస్, అధ్యక్షులు దేవరాజు గౌడ్, కౌన్సిలర్లు తేజాపు ప్రసాద్, శివ కృష్ణమూర్తి, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, పంతులు శీను తదితరులు పాల్గొన్నారు.