calender_icon.png 16 January, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పడిలేచిన కెరటం

03-08-2024 01:39:24 AM

పారిస్: ఒలింపిక్ పతకం అనేది ప్రతి ఒక్క అథ్లెట్ కల. పతకం సాధించడం కోసం ఏళ్లుగా నిద్రాహారాలు మాని శ్రమించడం చూస్తుంటాం. ఈలోగా ఏదైనా ప్రమాదం జరిగితే వారి బాధ వర్ణణాతీతం. కానీ నెదర్లాండ్స్‌కు చెందిన మహిళా రోయర్ మార్లోస్ ఓల్డెన్ బర్గ్ అందుకు భిన్నం. రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్‌కు గురైన ఓల్డెన్ బర్గ్ పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి అందరికి స్పూర్తిగా నిలిచింది. ఈసారి విశ్వక్రీడల్లో మహిళల ఫోర్ క్లాస్ రోయింగ్ పోటీల్లో టీమ్ విభాగంలో పసిడి పతకం నెగ్గి అందరి దృష్టిని ఆకర్షించింది.

స్వర్ణం నెగ్గిన అనంతరం ఓల్డెన్ బర్గ్ తన సంతోషాన్ని పంచుకుంది. ‘ ప్రమాదం జరిగిన తర్వాత నొప్పి వల్ల ఎటూ కదల్లేకపోయా.  మొక్కవోని దీక్షతో పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడి ప్రాక్టీస్ చేశాను.ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా పెట్టుకున్నా. రెండేళ్ల తర్వాత పారిస్ ఒలింపిక్స్‌లో వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టి స్వర్ణం సాధించడం గర్వంగా అనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చింది. రెండేళ్ల క్రితం పర్వత ప్రాంతాల్లో రైడింగ్ చేస్తుండగా.. ఓల్డెన్‌బర్గ్‌కు ప్రమాదం జరిగింది. వైద్యులు ఆరు గంటల పాటు శ్రమించి ఆమె వెన్నముకలో ఆరు పిన్నులను అమర్చారు.