- అంచనాలు అందుకోలేక చతికిలపడుతున్న టౌన్ ప్లానింగ్ విభాగం
- రివైజ్డ్ టార్గెట్‌నూ చేరుకోకపోవడంపై విమర్శలు
- వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా నామమాత్రపు టార్గెట్‌తో సరి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 31 (విజయక్రాంతి): బల్దియాలో కీలకమైన టౌన్ ప్లానింగ్ విభాగం ఆదాయం ప్రతి ఏడాది తగ్గుతూ వస్తోంది. తాము పెట్టుకున్న టార్గెట్‌ను కూడా రీచ్ కాలేక చతికిలపడుతోంది. తమ ఫెయిల్యూర్‌ను డైరెక్ట్‌గా అంగీక ఆ విభాగం అధికారులు బడ్జెట్ సవరణలకు పూనుకుంటున్నారు.
ఈ ప్రభావం మొత్తం బల్దియా ఆదాయాన్ని మరింత తగ్గేలా చేస్తుంది. టౌన్ ప్లానింగ్‌కు సమానమైన ప్రత్యామ్నాయ ఆదాయ వనరు లేక జీహెచ్‌ఎంసీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో బల్దియాకు ప్రతినెల చెల్లించాల్సిన అప్పు నిర్వాహణ వ్యయం తీవ్రమైన భారంగా మారుతోంది.
తగ్గుతున్న ఆదాయం..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రధానమైన ఆదాయ వనరులలో టౌన్ ప్లానింగ్ విభాగం అత్యంత కీలకమైంది. భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం ద్వారా గ్రేటర్ వ్యాప్తంగా ప్రతి ఏడాది పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చు అయితే కొన్నేళ్లుగా పట్టణ ప్రణాళిక విభాగం ఆదాయం క్షీణిస్తుంది.
గ్రేటర్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు 6 జోన్లు, 30 సర్కిళ్లలో నిర్మాణాలకు ఈ విభాగం అనుమతులు జారీ చేస్తుంది. అయితే కొన్నేళ్లుగా ఈ విభాగం ద్వారా బల్దియాకు ఆశించిన స్థాయిలో ఆదాయం లభించడం లేదు. 2023 రూ. 1,696 కోట్ల ఆదాయం లభించగా, 2024-25 బడ్జెట్‌లో రూ.1898 కోట్లను టార్గెట్ గా పెట్టుకుంది.
అయితే ఈ బడ్జెట్‌ను ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీలో 47 శాతం తగ్గించుకుని రూ.1001 కోట్లుగా రివైజ్డ్ బడ్జెట్‌గా ఫైనల్ చేసింది. 2024-25 ఏడాదికి సంబంధించి ఇప్పటివరకు మొత్తం 14,043 అనుమతులు జారీచేసి రూ.816 కోట్ల ఆదా లభించింది. రివైజ్డ్ బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఇంకా రూ.185 కోట్లు మాత్రమే టార్గెట్ ఉంది. రానున్న 2025 వార్షిక ఏడాదికి కేవలం రూ.1201 కోట్లను మాత్రమే బడ్జెట్ ప్రతిపాదనలను టార్గెట్‌గా చూపారు.
ప్లానింగ్ విభాగం ఫెయిల్యూర్..
బల్దియాలో ఒకప్పుడు కాసుల వర్షం కురిపించే టౌన్ ప్లానింగ్ విభాగం క్రమేపీ తన శోభను కోల్పోతుంది అన్నట్టుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి ఆధారం 2024 బడ్జెట్ ప్రతిపాదనలకు, 2025 ప్రతిపాదనలకు దాదాపు రూ.700 కోట్ల తేడాతో బడ్జెట్ రూపకల్పన చేయడమే అని టాక్.
రివైజ్డ్ బడ్జెట్‌లో రానున్న ఏడాది బడ్జెట్‌కు కేవలం రూ.200 కోట్లను పెంచినట్టుగా తెలుస్తుంది. హెచ్ కింద చేపడుతున్న 38 ప్రాజెక్టులలో 27 పనులకు రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్ అనుమతులు లభించగా, మరో 11 పనులకు అనుమతుల జారీ ప్రక్రియ పురోగతిలో ఉంది.
నగంరలోని మూడు కమిషనరేట్ల పరిధిలో రూ.233 కోట్లతో 90 జంక్షన్ల అభివృ ప్రతిపాదనలు అందగా, 74 పనులరే అనుమతులు ఇవ్వడం జరిగింది. మిగతావి ప్రాసెస్‌లో ఉన్నాయి. మరో రూ.200 కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ కింద మరో 4 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా, 2025లో హెచ్| ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తి చేయడంతో పాటు ట్రాఫిక్, టీజీఎస్‌పీడీసీఎల్ అధికారులతో సమన్వ చేసుకుంటూ జంక్షన్ల అభివృద్ధి పనులను పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.