calender_icon.png 30 April, 2025 | 7:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేల రాలిన మామిడి కాయలు

30-04-2025 01:19:15 AM

గాలి వానలతో రైతులకు తీరని నష్టం 

సుమారు 4 వేల ఎకరాల మేర రాలిన కాయ

జగిత్యాల, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ఆకుపచ్చ రంగుతో మిల మిలా మెరుస్తూ, చెట్టు నిండా కోతకు వచ్చిన మామిడి పంట కళ్ల ముందే గాలివాన బీభత్సంతో నేల రాలడంతో ఆ రైతుల పరిస్థితి కన్నీటి పర్యంత మైంది. ఇటీవల కురిసిన గాలివానల మూ లంగా సుమారుగా 3 వేల ఎకరాల పైచిలు కు మామిడి పంట చెడి పోయినట్లు అధికారిక అంచనా. కానీ 4 వేల ఎకరాలకు పైచిలు కే నష్టపోయామన్నది రైతు సంఘాల నాయకుల మాట. గత కొన్ని సంవత్సరాలుగా వరుసగా మామిడి రైతులు చేతికి అందివచ్చిన మామిడి కాయలకు ‘తేనె మంచు’ అలియాస్ ‘మంగు’ వైరస్ సోకడంతో అపా ర నష్టానికి గురవుతున్నారు. ఈ వైరస్ సోకి న మామిడి కాయ చూడడానికి నిండుగా, బలంగా ఉన్నప్పటికీ అక్కడక్కడ నల్లటి మ చ్చలు ఉంటాయి. ఆ మచ్చలున్న కాయల్ని హోల్ సేల్ మామిడి వ్యాపారులు చాటింగ్లో తీసేసి, ఎగుమతికి నిరాకరిస్తారు.

ఎందుకంటే సదరు వైరస్ సోకిన మామిడి ఎగుమ తిలో భాగంగా రెండు, మూడు రోజుల్లోనే పూర్తిగా కుళ్లి పోతుంది. అంతేకాకుండా వైర స్ సోకిన కాయలతో పాటూ ఉన్న మంచి కాయలు కూడా చెడిపోయే అవకాశాలున్నాయి. అలా చాటింగ్లో రిజెక్ట్ అయిన కాయ లకు కనీసం సగం ధర కూడా రాకపోవడంతో గత కొన్నేళ్లుగా మామిడి రైతులకు లాభం రావడం కాదు కదా, తీరని నష్టం వాటిల్లుతున్నది. ఈ ఏడాది జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మామిడి పంట చాలా మండలాల్లో ఆశించిన స్థాయిలో ఉండడంతో పాటు ధర కూడా బాగుండడంతో మామిడి రైతులు ఆనంద పడ్డారు. గతేడాది ఈ సీజన్లో మామిడికాయల ధర రైతుల నుంచి సేకరించే స్థానిక హోల్సేల్ వ్యాపారుల వద్ద కిలో ఒకటికి రూ. 30 నుండి 35 వరకు పలికింది.

ఈ ఏడాది ప్రస్తుతం కిలో ఒకటికి రూ. 40 నుండి 45 వరకు పలుకుతుండడంతో, వరుస నష్టాలతో ఉన్న మామిడి రైతుల ఆశలు చిగురించాయి. కానీ మామిడి రైతులపై మళ్లీ ప్రకృతి కన్నెర్ర చేయడంతో గత వారంలో ఓసారి, ఆదివారం రాత్రి మరోసారి ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం మామిడి రైతుల పాలిట శాపంగా మారింది. తద్వారా నిగనిగలాడుతూ మంచి ధరనందించే చేతికొచ్చిన మామిడి పంట నేల రాలడంతో రైతులు విలవిలలాడారు. ముఖ్యంగా జగిత్యాల జిల్లా పరిధిలోని కోరుట్ల నియోజకవర్గంతో పాటూ కథలాపూర్, రాయికల్ మండలాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లింది. 

ఈ క్రమంలో గాలివాన మూలంగా కోరుట్ల సెగ్మెంట్ పరిధిలోని కోరుట్ల మండలంలో 14 వందల ఎకరాలు, మెట్పల్లి మండలంలో 3 వందల 35 ఎకరాలు, ఇబ్రహీంపట్నం మండలంలో 4 వందల 60 ఎకరాలు, మల్లాపూర్ మండలంలో 4 వందల 62 ఎకరాలు, అలాగే కథలాపూర్ మండలం లో 1 వంద 76 ఎకరాల మేర మామిడి పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా. కాగా అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయా ప్రాంతాల మామిడి రైతులు కోరుతున్నారు.