calender_icon.png 16 March, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సునీత కోసం నింగిలోకి ఫాల్కన్ 9

16-03-2025 01:28:15 AM

ఐఎస్‌ఎస్‌లో చిక్కుకున్న సునీత కోసం..

  1. నలుగురు వ్యోమగాములతో రోదసిలోకి
  2. 9 నెలల నిరీక్షణకు తెర
  3. 19న భూమి మీదకి!

వాషింగ్టన్, మార్చి 15: అంతరిక్ష ప్రయో గం కోసం రోదసిలోకి వెళ్లి.. అక్కడి ఐఎస్‌ఎస్‌లో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌లను భూమ్మీదకి తీసుకొచ్చేందుకు నాసా-స్పేస్ ఎక్స్ సంయుక్తంగా ఫాల్కన్-9 అనే రాకెట్‌ను నింగిలోకి పంపాయి. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం ఈ రాకెట్ ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది.

‘క్రూ-10’ పేరిట నాసా-స్పేస్ ఎక్స్ జోడీ కట్టి ఫాల్కన్ రాకెట్‌ను నింగిలోకి పంపాయి. వాస్తవానికి మూడు రోజుల క్రితమే ఈ రాకెట్ రోదసిలోకి దూసుకుపోవాల్సి ఉన్నా.. సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. ఎట్టకేలకు శనివారం ఉదయం ఈ రాకెట్‌ను అమెరికా లోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి రోదసిలోకి పంపారు.

ఈ రాకెట్లో నాసాకు చెంది న వ్యోమగాములు మెక్క్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోస్ ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. వీరు సునీతా విలియ మ్స్, బచ్ విల్మోర్‌ను భూమిపైకి తీసుకురానున్నారు. ఎనిమిది రోజుల పని నిమిత్తం బోయింగ్ స్టార్ లైనర్‌లో అమెరికాకు చెంది న వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు.

కానీ ఆ మిషన్‌లో సాంకేతిక సమస్యల వల్ల వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ ఇద్దరు వ్యోమగాములు మార్చి 19న భూమ్మీదకు వచ్చే అవకాశం ఉంది. క్రూ- 10 మిషన్ ఐఎస్‌ఎస్‌కు చేరేందుకు 14 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.